
అల సంద్రపు గర్జనలో రామ శ్రీ రామ
ఊదే శంఖం శబ్దంలో రామ శ్రీ రామ
వెలిగించే అగ్ని జ్వాలల్లో రామ శ్రీ రామ
త్యాగం చేయు అన్న పిలుపుల్లో రామ శ్రీ రామ
కురిసే ముత్యపు చినుకుల్లో రామ శ్రీ రామ
పాలించే తండ్రి పిలుపుల్లో రామ శ్రీ రామ
మోగించే డంకా చప్పుడు లో రామ శ్రీ రామ
మరణం లేని తత్వంలో రామ శ్రీ రామ
గెలిచే గెలుపులో రామ శ్రీ రామ
హర్షించే తెలుగులో రామ శ్రీ రామ
కరతాళం చేసే చప్పుడూలో రామా శ్రీ రామ
నీ స్మరణంలోనే ఆనందం రామ శ్రీ రామ
రచన – B. రోహిణి